సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ

అక్షర ఉదయమ్ – పేరేచర్ల
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పేరేచర్ల జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించిన పోలీసులు
దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును తగ్గించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించడం ప్రధాన లక్ష్యంగా, అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసం (National Cyber Security Awareness Month) గా గుర్తించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల జంక్షన్ వద్ద ఈ రోజు పోలీసులు సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సీఐ శ్రీ నిస్సార్ భాషా గారు, మేడికొండూరు సీఐ నాగుల్ మీరా సాహెబ్ గారు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులు విద్యార్థులకు సైబర్ నేరాల ముప్పు, వాటిని నివారించే మార్గాలు గురించి వివరించారు.

పోలీస్ అధికారులు సూచించిన ముఖ్య సూచనలు:
- తెలియని లింకులు, సందేశాలు లేదా ఫ్రెండ్ రిక్వెస్టులు ఓపెన్ చేయవద్దు.
- బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTP లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.
- ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.
ఈ కార్యక్రమం ద్వారా సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, సురక్షితమైన డిజిటల్ వాతావరణం ఏర్పరచడం పోలీసు శాఖ ప్రధాన ఉద్దేశ్యం.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.