బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- 24×7 ప్రజలకు అందుబాటులో ఉండే పోలీస్ కమాండ్ కంట్రోల్ నెంబర్ 8333813228
- సబ్ డివిజన్ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
- లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీస్ అధికారులు
- ఎస్.డి.ఆర్.ఎఫ్, 8 క్విక్ రియాక్షన్ బృందాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది
- -జిల్లా ఎస్పీ శ్రీ వి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

అక్షర ఉదయమ్ – బాపట్ల
ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైన ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాల సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. మొంథా తుఫాను మరింత బలపడి, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదనే ముఖ్య ఉద్దేశంతో తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అక్కడ నివాసముంటున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుఫాను ఎక్కువగా ప్రభావం చూపడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో ఎస్.డి.ఆర్.ఎఫ్, క్విక్ రియాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. చీరాల, రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాలలో ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను పంపారు. 8 క్విక్ రియాక్షన్ బృందాలను సబ్ డివిజన్ పరిధిలో అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ గారు తెలిపారు.
ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతంగా పోలీస్ శాఖ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 24×7 పోలీస్ అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా లేదా పోలీస్ శాఖ సహాయం అవసరమైనపుడు 8333813228 నంబర్‌కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
అదేవిధంగా చీరాల, బాపట్ల, రేపల్లె సబ్‌డివిజన్‌ల పరిధిలో కూడా నోడల్ అధికారులను నియమించి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
చీరాల సబ్‌డివిజన్ – వి. నాగ శ్రీను (ఎస్‌ఐ చీరాల 2 టౌన్) – 9121104793.
బాపట్ల సబ్‌డివిజన్ – ఎం. విజయ్ కుమార్ (ఎస్‌ఐ బాపట్ల టౌన్) – 8978777298.
రేపల్లె సబ్‌డివిజన్ – పి. రవి ప్రసాద్ (సీసీ డీఎస్పీ రేపల్లె) – 9032030919.