ఆ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దు

అక్షర ఉదయమ్ – మచిలీపట్నం

+371(5), +381(2), +370 (255), +255, +563(2), నంబర్ నుంచి ఫోన్ కాల్స్ లేదా మిస్డ్ కాల్స్ వస్తే స్పందించవద్దని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నంబర్ల పై స్పందిస్తే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటామని చెప్పారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09 డయల్ చేయమంటే చేయవద్దని ఏమైనా సమస్య ఉంటే 1930 కాల్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.