కర్నూలు జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

అక్షర ఉదయమ్ – కర్నూలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి జి. కబర్థి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది కోర్టు ఆవరణంలో శుభ్రపరిచారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యనిర్వాహక ఇంజనీర్ కిషోర్ రెడ్డి సహకారంతో మొక్కలు నాటారు. 1వ అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి, మహిళా కోర్ట్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.