డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహించి ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన యువతి బంధువులు. హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి నిరసన చేసిన బాధితులు
వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఓ చిన్న పిల్లల హాస్పిటల్లో నర్సుగా పని చేస్తున్న (30) యువతి, గత మూడు రోజుల క్రితం పాము కరిచిందని పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చి చికిత్స తీసుకుందని, నాలుగవ రోజు మెడిసిన్ తీసుకోవడానికి హాస్పిటల్ కు వస్తే పాము అప్పుడు కరిచిందని ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ యువతి మృతి చెందిందని బంధువులు ఆరోపించి హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి ఆందోళన చేశారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం రాత్రి 11 గంటల వరకు మృతురాలి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.
కాగా ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని పట్టణ పోలీసులు తెలియజేశారు.