టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్లనాని

అక్షర ఉదయమ్ – అమరావతి 

సిఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆళ్ల నానికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.