
అక్షర ఉదయమ్ – పొన్నూరు
గుంటూరు జిల్లా పొన్నూరు, కాకుమాను మండలాల్లో గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఈనెల 8వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని పొన్నూరు ఎక్సైజ్ & ప్రొహిబిషన్ సీఐ రమేష్ గురువారం తెలిపారు. 9వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తామని 10వ తేదీ డ్రా తీసి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఔత్సాహిక గీత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.