గుంటూరు కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అక్షర ఉదయమ్ – గుంటూరు

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుంటూరు కలెక్టరేట్ లో గురువారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి 0863-2979766 ఫోన్ నంబర్ కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు, వివరాలకు కంట్రోల్ రూమ్ నంబర్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.