రెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం

అక్షర ఉదయమ్ – రెడ్డిగూడెం

పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెడ్డిగూడెం రాగానే అదుపుతప్పి ఒక బైక్, రెండు కార్ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.