
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఉదయం 8 గంటలకు పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలోని బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
9 గంటలకు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 69వ కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
10:30 గంటలకు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామం నందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 69వ కళ్యాణోత్సవం, తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎద్దుల (ఎడ్ల బండలాగుడు) పందాలను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు పిడుగురాళ్ళ పట్టణంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.
“అక్షర ఉదయమ్” న్యూస్