వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే రహదారిలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి గుంటూరు జిల్లా భద్రతా విభాగం వారిచే ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహణ

వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే రహదారిలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి గుంటూరు జిల్లా భద్రతా విభాగం(District Security Wing – DSW)వారిచే ప్రత్యేక మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహణ

ఈరోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళి కృష్ణ గారు, DSW ఆర్ఐ శ్రీ సురేష్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా సీడ్ యాక్సిస్ రోడ్ లో నిర్వహించిన మాక్ డ్రిల్ లో పాల్గొని,పర్యవేక్షించి, భద్రతా విభాగ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారు.

ఈ మాక్ డ్రిల్(Mock Drill)లో భాగంగా గుంటూరు జిల్లా భద్రతా విభాగ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక భద్రత పరికరాలు మరియు శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో

సీడ్ యాక్సిస్ రోడ్ మొదలు(మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం) నుండి N9 జంక్షన్ వరకు సీడ్ యాక్సెస్ రోడ్డులోని డివైడర్లు, చెట్ల పొదలు, పూల మొక్కల పాదులు మరియు రోడ్డుకి ఇరువైపులా ఉన్న కల్వర్టులు, వంతెనలు, తూములు వంటి పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరిగింది.

ఈ భద్రతా తనిఖీల కచ్చితత్వాన్ని పరీక్షించడానికి, జాగిలాల పనితీరుని అంచనా వేయడానికి సీడ్ యాక్సెస్ రోడ్డులోని ఒక చోట ఒక ప్రేలుడు పదార్థాన్ని గోప్యంగా పెట్టి బాంబు డిస్పోసల్ విభాగానికి చెందిన ఒక జాగిలం ఎంతో చాకచక్యంగా గోప్యంగా ఉంచిన సదరు ప్రేలుడు పదార్థాన్ని కనిపెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారు, తుళ్లూరు డిఎస్పీ గార్లతో పాటు తుళ్లూరు సీఐ కొంక.శ్రీనివాస్ గారు, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు గారు, ఎస్బి సీఐ శ్రీహరి గారు, జిల్లా భద్రతా విభాగ ఆర్ఐ సురేష్ గారు, పలువురు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..