
హిట్ సినిమాల సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే థ్రిల్ చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త టచ్‌తో తెరకెక్కుతున్న ఈ సిరీస్, మొదటి రెండు భాగాల విజయంతో సిరీస్ పై భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హిట్-3 తో ప్రేక్షకులను మళ్లీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి నుంచి భారీ అంచనాల నడుమ ముందుకు సాగుతోంది. నాని ఈ సిరీస్‌లో “అర్జున్ సర్కార్”గా మరో ఇంటెన్స్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు.
హిట్-3 క్లైమాక్స్ చివర్లో ప్రేక్షకులను షాక్‌కు గురిచేసేలా ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం, హిట్-3 క్లైమాక్స్‌లో ఒక మాస్ హీరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఆయన హిట్-4లో ప్రధాన పాత్రలో ఉంటారని, ఈ సిరీస్‌కు మరో డైనమిక్ షిఫ్ట్ ఉంటుందని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు.
ఇది నిజమైతే, ప్రేక్షకులు ఈ సిరీస్‌లో మునుపెన్నడూ ఊహించని మాస్ ఎంటర్టైన్మెంట్‌ను చూడబోతున్నారు. ఇది మాత్రమే కాదు, హిట్-4లో కనిపించబోయే మాస్ హీరో పేరు ఇప్పట్లో రివీల్ కాకుండా రహస్యంగా ఉంచారని సమాచారం. అతని పాత్ర సరికొత్త కోణాన్ని తెస్తుందని, మునుపటి సిరీస్‌ల కంటే హిట్-4 మరింత హై వోల్టేజ్, ఇంటెన్స్ అంశాలతో నిండిపోతుందని ప్రచారం జరుగుతోంది. హిట్-4కు ఈ మాస్ హీరో కలవడం, సిరీస్‌కు కొత్త స్థాయిని తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే హిట్-3 పై ఉన్న హైప్‌తో పాటుగా, హిట్-4 పై ఇప్పుడు ఆసక్తి పెరిగిపోతోంది. ఒక వైపు నాని సక్సెస్ ట్రాక్‌ను హిట్-3తో కొనసాగించాలనుకుంటే, మరోవైపు ఈ కొత్త మాస్ కోణంతో సిరీస్ మరింత పెద్ద స్థాయికి వెళ్ళబోతోందన్న భావన పెరిగిపోతోంది. నాని, శైలేష్ కొలను హిట్ సిరీస్ మేకర్స్‌తో కలిసి, ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఇక, హిట్-3 క్లైమాక్స్‌లో మాస్ హీరో ఎలా సందడి చేస్తారో చూడాలి.