ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం అమలు తప్పనిసరి

అక్షర ఉదయమ్ – బాపట్ల
ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని పలు శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పారదర్శకత కోసం ప్రతి దస్త్రం ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులకు సూచన.
డ్వామా కార్యాలయంలో టేబుల్స్ పై దస్త్రాలు కనిపించడం పై కలెక్టర్ అసంతృప్తి – మళ్లీ పునరావృతం కావద్దని హెచ్చరిక.

ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చే ప్రతి ఫైల్ ఇ-ఆఫీస్ విధానంలోనే రావాలి.
కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్యం పై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు.
కలెక్టరేట్ ఆవరణలో కొత్తగా మారిన జిల్లా సమాచార & పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ, నీటి యాజమాన్య సంస్థ, ఆడిట్, సహకార, పంచాయతీ, మత్స్య, అగ్ని మాపక, గృహ నిర్మాణ కార్యాలయాల తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.