
అక్షర ఉదయమ్ – విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ కొరత తీరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్ కు పూర్తి స్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు స్టిల్ ప్లాంట్ అధికారులు ఆ సంస్థతో గురువారం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడు బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకురానున్నారు.