మొంథా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది

మొంథా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది

 

ఉప్పాడ తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి.

తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

అక్కడ వారికి ఆహారం, వసతి, వైద్య సౌకర్యాలు కల్పించారు.

కాకినాడ కలెక్టరేట్లో తుపాను పర్యవేక్షణ ప్రత్యేకాధికారి కృష్ణతేజ, కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పర్యవేక్షిస్తున్నారు.

ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీలు తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అక్షర ఉదయమ్ – కాకినాడ