జనసేన ఆవిర్భావ సభపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్

జనసేన ఆవిర్భావ సభపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్

 

అక్షర ఉదయమ్ – అమరావతి 

 

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్, నేతలు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

 

“ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన చిత్తశుద్ధితో పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధిలో జనసేన పాత్ర కీలకం” అని ఆయన అన్నారు.

 

“జనసేనకు ప్రకాశవంతమయిన భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహం లేదు.”

 

“సాధించిన విజయాలు స్మరించుకుందాం.. భవిష్యత్‍కు మార్గనిదేశం చేసుకుందాం.. జయకేతనం” అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.