నాగార్జున సాగర్ కాల్వలకు 59వ వసంతం

నాగార్జున సాగర్ కాల్వలకు 59వ వసంతం

 


అక్షర ఉదయమ్ – నాగార్జునసాగర్

ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ, కాల్వలకు నేడు 58 వసంతాలు పూర్తి అయ్యాయి. జాతికి అంకితమైన ఈరోజును మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.

1967 ఆగస్టు 4వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టు జాతికి అంకితమిస్తూ కాలువలకు నీటిని విడుదల చేశారు.

నీరు లేని బీడు భూములను బంగారు పంటలు పండిన హరిత విప్లవానికి నాంది పలికిన చారిత్రక నిర్ణయం, రైతుని రారాజు చేసిన ప్రాజెక్టు ఇది. తరగని ఖనిజంగా నాగార్జునసాగర్ రూపొంది.

కుడి కాలువ (జవహరు కాలువ)

నాగార్జునసాగర్ జలాశయo నుంచి ఆనకట్టకు కుడి వైపు నుండి ప్రారంభమయ్యే కుడి కాలువకుజవహరు కాలువగా నామకరణం చేయటం జరిగింది. పండిత జవహరు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు . ఆంధ్ర దేశానికి వారిచ్చిన వర ప్రసాదమే నాగర్జున సాగరం. అందుకు కృతజ్ఞతగా ఈ కాలువకు వారి పేరునే స్ధిర పరచటం జరిగింది.

కుడి కాల్వ తవ్వకాన్ని 1956 అక్టోబర్ 10న అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. దీని నిర్మాణానికి 1250 మంది కార్యాలయ సిబ్బంది. 4 వేల మంది సాంకేతిక సిబ్బంది, 40,000 వేల మంది సాధారణ కార్మికులు దాదాపు 12 సంవత్సరాల పాటు పని చేశారు.

సాగర్ రిజర్వాయర్ నుంచి ఈ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద 9 గేట్లను అమర్చారు. ఈ హెడ్ రెగ్యులేటర్ వద్ద జల విద్యుత్ కేంద్రం కూడా నిర్మించారు. ఈ కాల్వ దక్షిణ విజయపురి వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రవాహం ప్రారంభిస్తుంది. ఈ సొరంగం గుర్రపు నాడా ఆకారంలో 27 అడుగుల వ్యాసంతో తొలచబడింది. దీని పొడవు 4210 అడుగులు. పూర్తి నిర్మాణ దశలో 245 మైళ్లు. ప్రపంచంలోని అత్యంత పొడవు గల కాలువలలో ఒకటిగా ఖ్యాతిని సంతరించుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు 11,11,410 ఆయకట్టు భూమి సాగులోకి వస్తుంది. ఇది సోమశిల వద్ద పెన్నా నదిలో కలుస్తుంది ఈ కాల్వ 21,000 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో 20 లక్షల 62 వేల ఎకరాల భూములకు సాగు నీరందించే సామర్ధ్యంతో నిర్మితమైంది. కాలువ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందించే చంద్రవంక నాగులేరు, గుండ్లకమ్మ, బుగ్గేరు మొదలైన 178 పెద్ద, చిన్న వాగులను దాటుకుంటూ ప్రవహిస్తుంది. 1967 ఆగష్టు 4న నాటి ప్రధాని ఇందిరా గాంధి కుడి కాలవకు నీటిని విడుదల చేసి, జాతికి అంకితం చేశారు. దీనికి మన ప్రథమ ప్రధాని జ్ఞాపకార్ధం జవహర్ కెనాల్ అని నామకరంణo చేశారు.

ఎడమ కాల్వ (లాల్ బహుదూర్ కాలువ)

నాగార్జునసాగర్ జలాశయానికి పూర్తిగా ఎడమ కొన నుండి ప్రారంభమయ్యే ఎడమ కాలువకు లాల్ బహుదూర్ కాలువ అని నామకరణం చేయటం జరిగింది.

ఎడమ కాల్వ నాగార్జున సాగర్ డ్యామ్ కు 6 కిమీ దూరంలో ఉన్న పొట్టిచేలమ్మ ప్రాంతం నుంచి ఎడమ కాల్వ ప్రారంభం అవుతుంది.

సాగర్ ఎడమ కాల్వకు “ జై జవాన్ – జై కిసాన్” అని పిలుపు నిచ్చిన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ పేరు పెట్టారు. ఈ కాల్వ ప్రారంభమైన కొంత దూరంగా పొట్టిచెలః వద్ద సొరంగం ద్వారా ప్రవహించి చలకుర్తి వద్ద భూ ఉపరితలంలో కన్పిస్తుంది.

ఈ సొరంగ మార్గo 32 అడుగుల వ్యాసం, 8465 అడుగుల నిడివి కలిగి గుర్రపు నాడ ఆకారంలో మలచ బడి ఉంది. కాల్వ ప్రవహించే సొరంగ మార్గం యావత్ భారతదేశంలోనే పెద్దది. ఈ సొరంగపు నిర్మాణానికి 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్ భిమ్ సేన్ సచార్ శంకుస్ధాపన చేశారు.

కాల్వ నిడివి తుది దశలో 218మైళ్లు. ఇది హాలియా, గడవరం, వైరా, కట్టలేరు, తమ్మిలేరు మొదలైన 138 పెద్దా, చిన్న వాగులను, మూసీనదిని దాటుకుంటూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణ జిల్లాలోని ప్రవహించి చివరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్ర కాల్వలో కలుస్తుంది. దీని నిర్మాణానికి 900 మంది కార్యాలయ సిబ్బంది, 2,500 మంది సాంకేతిక సిబ్బంది, 30 వేల మంది కార్మికులు దాదాపు 10 సంవత్సరాలు విశేషంగా కృషి చేశారు. దీనిని కూడా 1967 ఆగష్టు 4న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నీటిని విడుదల చేసి ప్రారంభించారు. ఇది దాదాపుగా 179 మైళ్ళ వరకు తవ్వకం జరిగింది. సుమారు 22 అడుగుల లోతు గల కాల్వ ద్వారా 15వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దీని ద్వారా ప్రస్తుతం సుమారు 11,24,500 ఆయకట్టు భూమి సాగులోకి వస్తుంది. దీని హెడ్ రెగ్యులేటర్ వద్ద కూడా జల విద్యుత్ కేంద్రం నిర్మించారు.

అక్షర ఉదయమ్ – నాగార్జునసాగర్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in