పల్నాడులో 22 బార్లకు రీ-నోటిఫికేషన్
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 22 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం గెజిట్ విడుదలైనట్లు పేర్కొన్నారు. వీటిలో నరసరావుపేట – 7, చిలకలూరిపేట – 5, పిడుగురాళ్ల – 4, మాచర్ల – 3, వినుకొండలో 3 బార్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు బుధవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.