చీరాల వాడరేవులో సముద్ర హారతి కార్యక్రమం

అక్షర ఉదయమ్ – చీరాల

హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో చీరాల మండలం వాడరేవులో బుధవారం రాత్రి నిర్వహించిన సముద్ర హారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహా శివునికి వివిధ ద్రవ్యాభిషేకలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సముద్ర హారతి కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సముద్ర హారతిని వీక్షించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.