లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

అక్షర ఉదయమ్ – సింగరాయకొండ

లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సింగరాయకొండ జాతీయ రహదారి పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పొగ మంచు కారణంగా రహదారి కనిపించక ప్రైవేటు బస్సు లారీని వెనక నుంచి ఢీ కొట్టినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. క్యాబిన్ లో ఇరుక్కున్న బస్సు డ్రైవర్ ని అతి కష్టం పై బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.