ఎమ్మెల్సీ ఎన్నికలకు సిబ్బంది సిద్ధం

అక్షర ఉదయమ్ – పెద్దాపురం

 

పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోని 11 మండలాల్లో ఫిబ్రవరి 27న నిర్వహించే ఉభయ గోదావరి జిల్లా పట్ట భద్రుల శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం 31 కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. పీవోలు 31 మంది, ఏపీవోలు 31 మంది, ఏపీవోలు 31, ఓపీవోలు 62 మందిని నియమించినట్లు వివరించారు.