శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో 09.08.2025 నుంచి అమల్లోకి గుంటూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో, ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం గుంటూరు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా కొన్ని మార్గాలు మళ్లింపు చేపట్టారు. ఈ డైవర్షన్లు శనివారం, 09.08.2025 నుండి అమల్లోకి వస్తాయి.
???? ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు:
1. అమరావతి రోడ్ → MTB సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :
▪️చిల్లీస్ పాయింట్ నుండి → ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించాలి.
2. Lodge సెంటర్ → MTB సెంటర్ వైపు కార్లు, ఆటోలు, టూ వీలర్లు :-
▪️అరండల్ పేట → పొట్టి శ్రీరాములు నగర్ → డొంక రోడ్డు → మూడు వంతెనలు (లేదా)
▪️బ్రాడీపేట → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గంగా ప్రయాణించాలి.
???? తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో చేయాలి.
3. MTB సెంటర్ → Lodge సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ (స్కూల్, కాలేజ్ బస్సులు సహా) :
▪️రమేష్ హాస్పిటల్ నుండి → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని వినియోగించాలి.
4. కోబాల్ట్ పేట, కృష్ణానగర్, చంద్రమౌళినగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలు :
▪️పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ (లేదా)
▪️బ్రాడీపేట 18 లైన్ → కంకరగుంట అండర్‌పాస్ → కలెక్టర్ ఆఫీస్ రోడ్ → రమేష్ హాస్పిటల్ మార్గం.
5. పట్టాభిపురం నుండి GGH వైపు వెళ్లేవారు :-
కంకరగుంట ఫ్లైఓవర్ → MTB సెంటర్ → వుమెన్స్ కాలేజ్ → పల్లవి థియేటర్ మార్గాన్ని వినియోగించాలి.
6. Lodge సెంటర్ → MTB సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :-
▪️చిల్లీస్ → ఇన్నర్ రింగ్ రోడ్ → ఆటోనగర్ → బస్టాండ్ (లేదా)
▪️కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాలను ఉపయోగించుకోవాలి.
ప్రజలకు సూచనలు:
వాహనదారులు పై మార్గదర్శకాలను అనుసరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించగలరు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..