రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసుల బదిలీలు

అక్షర ఉదయమ్ – విజయవాడ

కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ ప్రక్రియ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.

సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఈరోజు ఉదయం నుండి PGRS (మీ కోసం) హాల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు, ఐపీఎస్ గారు మహిళా పోలీసులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు సజావుగా నిర్వహించారు. ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు గారు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ గారు, AO M.M సుబ్రమణ్యం గారు, AAO యంగన్న గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు ఇతర పోలీస్ అధికారులు జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ

ఈ బదిలీలను ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే చేస్తామని, బదిలీలు కోరుకునే వారు తన స్వగ్రామం/వార్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని, ఖాళీల వారీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ప్లే నందు ఉంచామని, అందులో మీకు నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం మీకే ఉందని తెలిపారు.

ఈ రోజు నిర్వహించిన బదిలీల్లో వారి ర్యాంకుల ఆధారంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పౌస్ కోటా, దివ్యాంగుల కోటా మరియు ఆరోగ్య పరమైన సమస్యలు ప్రాతిపదికన బదిలీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది.

ఈరోజు మొత్తం మొత్తం సుమారు 400 మందికి పైగా మహిళా పోలీసులు ఆఫ్ లైన్/ఆన్లైన్లో బదిలీ కొరకు దరఖాస్తు చేసుకొని కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు .

కొంతమంది కోరుకున్న ప్రదేశాలలోకి బదిలీ కోరగా, మరికొంత మంది యధావిధి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలిపారు. సదరు బదిలీల నివేదికను జిల్లా కలెక్టర్ గారికి పంపి తద్వారా వారికి పోస్టింగ్ ఆర్డర్ కాపీలు అందజేయడం జరుగుతుంది.

ఈ బదిలీ ప్రక్రియ అంత పూర్తిపారదర్శకంగా ఏ విధమైన ప్రలోభాలు అవకాశం లేకుండా నిర్వహించడం జరుగుతుందని కనుక మీకు కేటాయించిన ప్రదేశాలలో యధావిధిగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

అనంతరం ఈ కౌన్సిలింగ్ లో పాల్గొన్న మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర రావు ఐపీఎస్ గారు భోజనం ఏర్పాటు చేయించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..