టాస్క్ ఫోర్స్ బృందం జరిపిన రెండు దాడుల్లో కేజి గంజాయి స్వాధీనం, నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ బృందం జరిపిన రెండు దాడుల్లో కేజి గంజాయి స్వాధీనం, నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగినదనీ, ఇక నుండి టాస్క్ బృందం వారిచే నిరంతర దాడులు నిర్వహించడం జరుగుతుందని గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు.

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు(16.10.2025) తెల్లవారు జామున 02:00 గంటలకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్తూరు శివారులోని వెంచర్లో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురు పేకాట రాయుళ్లను, మూడు సెల్ ఫోన్లను, మూడు ద్విచక్ర వాహనాలను, రూ.8,400/- నగదును సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారు:
* చాట్ల జయరాజు
* యేసుపోగు.మురళి
* చాట్ల. దానియేలు
* Sk.రసూల్

అదే విధంగా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబీ డాబా వద్ద గంజాయి అక్రమ సరఫరా అవుతుందని రావడిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించి, గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 1 కిలో గంజాయి మరియు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారి వివరాలు:
* గుంజి.మోహన్, గుంటూరు.
* వీర్ల. వెంకట చిన్న, గుంటూరు

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.