బాపట్లలో హెల్మెట్ చెకింగ్

అక్షర ఉదయమ్ – బాపట్ల

 

బాపట్ల పట్టణం వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ రాంబాబు సూచించారు. బాపట్ల టౌన్ పాత బస్టాండ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం సీఐ రాంబాబు, ఎస్ఐ ఎ.చంద్రిక ఆధ్వర్యంలో టూ వీలర్ హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని పలువురు వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి హెల్మెట్ ఉపయోగాలు గురించి వివరించారు.