కాకినాడ నుంచి కుంభమేళాకు ఆర్టీసీ బస్సు ప్రారంభం

అక్షర ఉదయమ్ – కాకినాడ

 

కాకినాడ డిపో నుండి సోమవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఒక సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సును జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, డిపో మేనేజర్ ఎంవివి మనోహర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ బస్సులు కాకినాడ నుండి బయలుదేరి భువనేశ్వర్, పూరి, కోణార్క్ మీదుగా ప్రయాగ్ రాజ్ చేరుకుని అక్కడ త్రివేణి సంగమం చేరుకోవడం జరుగుతుందన్నారు.