
అక్షర ఉదయమ్ – విశాఖపట్నం
విద్యుత్ లైన్ల మరమతుల్లో భాగంగా శుక్రవారం ఎన్ఎడి పరిధిలోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విశాఖ జోన్ 2 ఆపరేషన్ ఏఈ బికే నాయుడు గురువారం తెలిపారు. ఎన్ఎడి, సాకేతపురం, వినోద నగర్, విమాన నగర్, కాకాని నగర్, దుర్గాపురం, జ్యోతి నగర్, లక్ష్మీ నగర్, మాధవధార ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.