తెనాలిలో పట్టపగలు భారీ చోరీ

అక్షర ఉదయమ్ – తెనాలి

 

తెనాలి పట్టణంలోని మారీసుపేటలో గురువారం భారీ చోరీ జరిగింది. మఠంబజారుకు చెందిన షేక్ సుభాని – షాహినా బేగం ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి రూ. 1 లక్షకు పైగా నగదు, 9 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. షాహినా బేగం ఉ.11 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గం.లకి వచ్చి చూస్తే తాళాలు పగలకొట్టి ఉన్నాయి. ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండగా నగదు ఆభరణాలు మాయం అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.