
అక్షర ఉదయమ్ – రాజమండ్రి
వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు సూచించారు. గురువారం రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాహనాలు నడిపే వారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. బైక్ నడిపేవారి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలిని అలాగే కారు మొదలైనవి నడిపేవారూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మనవి చేశారు.