తెనాలిలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

అక్షర ఉదయమ్ – తెనాలి

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒక్క వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మధ్యాహ్నం తెనాలిలో జరిగింది. చేరుకుపల్లి నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు వంతెన వద్ద మోటార్ బైకును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మోటార్ బైక్ పై వెళ్తున్న రవి తీవ్రంగా గాయపడగా స్థానికులు అతడిని తెనాలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉండటంతో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.