
అక్షర ఉదయమ్ – తాడేపల్లి
తాడేపల్లి గంజాయి కేసులో 4 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు అరెస్టు చేసినట్లు తాడేపల్లి సీఐ బి. కళ్యాణ్ రాజు తెలిపారు. శనివారం సీఐ ఒక ప్రకటన ద్వారా కేసు వివరాలను వెల్లడించారు. గంజాయి అమ్ముతూ నిందితుడు కట్ట వెంకట రత్తయ్య తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. తాడేపల్లి మార్కెట్ సెంటర్లో నిందితుడు ఉన్నట్టు పక్క సమాచారం రావడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.