దాచేపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యరపతినేని నిఖిల్

📰 Generate e-Paper Clip

దాచేపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యరపతినేని నిఖిల్ 

 – ఆలపాటిని గెలిపించాలని విజ్ఞప్తి 

 

అక్షర ఉదయమ్ – దాచేపల్లి 

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయు) భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యరపతినేని నిఖిల్, కూటమి నాయకులు గురువారం రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులను, యూనియన్ సభ్యులను కలసి, కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

 

అదే విధంగా దాచేపల్లి పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యరపతినేని నిఖిల్, కూటమి నాయకులు పట్టభద్రుల ఎన్నికల ఓటర్లను కలసి, కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.