గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు రేంజ్ ప్రొబేషనరీ ఎస్సైలు

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

 

శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు గుంటూరు రేంజ్ ఐజీ గారి కార్యాలయంలో గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు రేంజ్ కింద ఎంపికైన ప్రొబేషనరీ ఎస్సైలు.

ఈ సందర్భంగా గౌరవ ఐజీ గారు నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలకు హృదయపూర్వక అభినందనలు తెలిపి విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా సేవలు అందించి పోలీస్ శాఖ యొక్క పేరుప్రతిష్టలను ఇనుమడింప చేయాలని సూచించారు.

గుంటూరు రేంజ్ పరిధి కింద 53 మంది (36 పురుషులు, 17 స్త్రీలు) ఎస్సైలు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని గౌరవ ఐజీ గారికి మర్యాద పూర్వకంగా కలవగా, గౌరవ ఐజీ గారు వారికి జిల్లాలను కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను అందించడం జరిగింది.

జిల్లాల వారీగా కేటాయింపులు :

గుంటూరు – 22 మంది
పల్నాడు – 13 మంది
బాపట్ల – 10 మంది
ప్రకాశం – 01 మంది
నెల్లూరు – 03 మంది
తిరుపతి – 04 మంది

02.03.2025 నుండి 06.03.2025 తేదీ వరకు ప్రొబేషనరీ ఎస్సైలు సెలవు మంజూరు చేసి, తిరిగి 07.03.2925 వ తేదీ నుండి గ్రేహౌండ్స్ శిక్షణ కొరకు పంపించడం జరుగుతుందని గౌరవ ఐజీ గారు తెలిపారు.