అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు జిల్లాలో గౌరవ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహిళల సమస్యల పరిష్కారానికై “మహిళా ఫిర్యాదుల విండో( Women Grievance Window)” అనే వినూత్న కార్యక్రమానికి రూపకల్పన.
మార్చి నెల 7వ తేదీన జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో “మహిళా ఫిర్యాదుల విండో( Women Grievance Window)” కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక.
మహిళలు తమ ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలని సూచన.
మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ట్రైనీ ఐపీఎస్ శ్రీమతి దీక్ష గారు.