గత రంజాన్ పండుగకు నమాజ్ కు వచ్చినప్పుడు నేను మాజీ శాసన సభ్యుడిని
- మీ అందరి ఆశీస్సులతో అల్లా దయతో ఈ రంజాన్ పండుగకు శాసన సభ్యునిగా మీ ముందున్నా..
- రంజాన్ వేడుకలో ఎమ్మెల్యే యరపతినేని
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

ముస్లిం సోదర సోదరీ మణులకు అస్సలాము అలైకుమ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ : గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని యరపతినేని నగర్ లోని ఈద్గాలో సోమవారం గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ముస్లిం సోదరులతో కలిసి ఆనందోత్సవాలతో ఈదుల్ ఫితర్ నమాజ్ చదివి రంజాన్ వేడుకలు జరుపుకున్నారు.

ఈ నమాజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ “పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమ, నిష్టలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని ఉపవాసాలు ఉండి ఉపవాస దీక్షలు ముగించి, ఈదుల్ ఫితర్ నమాజు చదువుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “గత రంజాన్ పండుగకు నమాజ్ కు వచ్చినప్పుడు నేను మాజీ శాసన సభ్యుడిని, ఇప్పుడు మీ అందరి ఆశీస్సులతో అల్లా దయతో ఈ రంజాన్ పండుగకు శాసన సభ్యునిగా మీ ముందున్నానని” అన్నారు. ముస్లిం సోదరులందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని, అన్ని వృత్తులకు సంబంధించిన వారు చేతి నిండా పని ఉండి అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని “అల్లాహ్”ని వేడుకుంటూ, నేను ముస్లిం కుటుంబంలో పుట్టక పోయినా ముస్లిం సోదర సోదరీ మణులకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఆనంద పడుతున్నానని యరపతినేని చెప్పారు. రాజకీయ జీవితంలో ఉన్నన్నాళ్లు, తర్వాత కూడా ముస్లిం సోదరులకు అండగా ఉంటానని ఇప్పుడు మనమందరం నమాజ్ చదువుకుంటున్న ఈద్గాను రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మూడు ఎకరాలు స్థలం మంజూరు చేయించి, ముస్లిం సోదరులకు నా వంతు సాయంగా నా సొంత డబ్బులతో ఈద్గా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గత పాలకులు ఈద్గాలో ముస్లిం సోదరులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పార్టీల వంకతో ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేయక పోయినా మనమే చేశాం.
మీ అందరి ఆశీస్సులతో ముస్లింల చిరకాల కోరిక అయిన హజ్ యాత్రకు, నేను కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలోని ఏ ఎమ్మెల్యే చేయనంతగా హజ్ కు వెళ్లే సోదర సోదరీ మణులకు తలా లక్ష రూపాయలు ఇచ్చి, సుమారు 50 మందిని మక్కా యాత్రకు పంపించి ఆ పుణ్యంలో పాలు పంచుకున్నానని పేర్కొన్నారు. గురజాల నియోజక వర్గంలో మనం పెట్టిన తర్వాతే మొన్న 2024 ఎన్నికల్లో కూటమి ఎజెండాలో కూడా హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఇక నుంచి హజ్ కు వెళ్లే ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు గురజాల నియోజవర్గ ముస్లిం సోదరులకు నా తరపున లక్ష రూపాయలు ఇచ్చి పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరుల్లో ఒకడిగా ఉంటూ మీకు సేవ చేసుకుంటానని, మీరు కూడా మీలో ఒకడిగా నన్ను ఆదరించాలని” ఈ సందర్భంగా యరపతినేని కోరారు.

పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా పిడుగురాళ్ళ పట్టణం యరపతినేని నగర్ లోని ఈద్గా, జానపాడు రోడ్డు లోని ఈద్గాల వద్ద నమాజ్ చదివే ముస్లిం సోదర సోదరీ మణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కూలర్లు, టెంట్లు షామియానాలు, త్రాగునీరు సదుపాయాలు కల్పించటం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఖాజీ మౌలానా అబ్దుల్ కరీం నమాజ్ చదివించారు. పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ శాసన సభ్యులు శ్రీనివాసరావుని ముస్లిం సాంప్రదాయ దుస్తులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాబావలి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ టిడిపి మస్తాన్ వలి, పట్టణ ఉపాధ్యక్షులు కార్ షైదా, టిడిపి బాషా, ఫరీద్ మేస్త్రి, పెద్ద బుడే, షేక్ ఖాదర్ వలీ, షేక్ ముజీబ్, సయ్యద్ ఇర్షాద్, డాక్టర్ వలీ, డాక్టర్ సర్దార్, వాచర్ బుడే, అబ్దుల్ గనీ, షేక్ రజాక్ సోఫి, మోమిన్ గని, ఇమ్రాన్, పఠాన్ ఖాసిం, కొట్టు భాష, ముస్తఫా, నాగూరు, షేక్ జిలాని, షేక్ జమాల్, షేక్ ఇంతియాజ్, షఫీలతో పాటుగా పిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొని ముస్లిం సోదరులతో పాటు ఈద్ నమాజ్ ఆచరించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు అందరూ ఆనందోత్సాహాలతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియ జేసుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన యరపతినేని శ్రీనివాసరావుని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.