రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్..

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమ, నిష్టలతో, కటోర దీక్షలతో నెల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని ఉపవాసాలు ఉండి ఆదివారం ఉపవాస దీక్షలు ముగించుకుని, ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుకుంటున్న రాష్ట్రంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు, వైసీపీ శ్రేణులకు వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని, అన్ని వృత్తులకు సంబంధించిన వారు చేతినిండా పని ఉండి అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని “అల్లాహ్” ని వేడుకుంటున్నానని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.