‘అమరావతి’కి తొలి విడత రుణం
– ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

అక్షర ఉదయమ్ – అమరావతి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) నుంచి తొలి విడత రుణం మంజూరు అవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.