ప్రజల సమస్యలను తీర్చడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీ కోసం)లో అందిన ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు, ఐపిఎస్.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సల్ సిస్టమ్) మీ కోసం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి విచ్చేశారు.
▪️ఎస్పీ గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను నిశితంగా విని, వారి సమస్య ఆధారంగా సంబంధిత పోలీసు అధికారులకు ఆఫిర్యాదులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా పని చేయాలని స్పష్టం చేశారు.
▪️ఈ రోజు నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాలు, సివిల్ తగాదాలు వంటి వివిధ అంశాలపై మొత్తం 33 పిటీషన్లు స్వీకరించారు. ఈ పిటీషన్లను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.
అక్షర ఉదయమ్ – మచిలీపట్నం
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..