వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులు తగదు
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

అక్షర ఉదయమ్ – దాచేపల్లి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు ఉప్పుతోళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను గురువారం తెల్లవారు జామున దాచేపల్లి సిఐ భాస్కరరావు అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దాచేపల్లి పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. హరికృష్ణను ఎందుకు అరెస్టు చేశారని చింతలపూడి అశోక్ కుమార్ పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు చెప్పారని అన్యాయంగా అక్రమంగా వైఎస్సార్ సిపి నాయకులను అరెస్టు చేసి, పోలీసు స్టేషన్లో చితక బాదితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డాక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొంత సేపు పోలీసులకు, అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. చింతలపూడి అశోక్ కుమార్ వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..