గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం “మన ఊరు మాటా – మంతి”

గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం మన ఊరు మాటా – మంతి

 


అక్షర ఉదయమ్ – అమరావతి

గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం మాటా – మంతి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గం రావివలస పంచాయతీ ప్రజలందరిని టెక్కలిలోని సినిమా థియేటర్ కు తీసుకువచ్చి వారితో క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను గ్రామ ప్రజల నుండి తెలుసు కోవడం జరిగింది. దీంతోపాటు వెంటనే పరిష్కారం చేయగలిగే పనులను అప్పటికప్పుడు అధికారులతో చెప్పి అనుమతులు మంజూరు చేశారు. అలాగే కొన్ని సమయం పట్టే పనులకు సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులందరూ ఎంత ఉత్సాహంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను, తాము కోరుకుంటున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తెలియజేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..