ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం


2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది

– వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుంది

– మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం

– రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

– ఇంత వరకు ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం గత ఐదేళ్లలో జరిగింది

– గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది

– వైసీపీ చేసిన విధ్వంసానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు

– ఎవరూ ఊహించని విధంగా ప్రజలు మాకు విజయం కట్టబెట్టారు

– ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి

– ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి ఏడుగురు కేంద్ర మంత్రులను కలుస్తున్నా

– మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది

– ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి

– రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరాం

– గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు

– సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం

– సూర్యఘర్ కింద ప్రతి నియోజక వర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం

– సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం

– కుసుమ్ కింద 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది

– రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారబోతుంది

– గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుంది

– ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌కు అభినందనలు తెలిపాను

– జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉంది

– జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌ను మిస్సెల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరాం

– లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాం

– విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పరిమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరాం

– కర్నూలు-ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రొబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని కోరాం

– తిరుపతి ఐఐటీలో డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని కోరాం

– మా ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు

– రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరా.. సానుకూలంగా స్పందించారు

– జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పోలవరంపై చర్చించాను

– పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది

– ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం

– పోలవరం నాణ్యతలో రాజీ పడం

– రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం దెబ్బ తీసింది

– గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మళ్లీ రూ.980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాం

– పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది

– పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చు

– పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు

– సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం

– కేంద్రం అనుమతి ఇవ్వగానే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తాం

– శాంతి, భద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమీక్షించారు

– శాంతి, భద్రతల కోసం కేంద్ర హోం మంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు

– అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం.. సానుకూలంగా స్పందించారు

– ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం

– పూర్వోదయ పథకం మరికొన్ని నిధులు ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను

– పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని నిర్మలా సీతారామన్‌ను కోరాం

– మా ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు

– సంక్షేమాన్ని కొనసాగిస్తూనే.. అభివృద్ధి చేస్తున్నాం

– సంపద సృష్టించాలంటే ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకురావాలి

– కేంద్రం నుంచి ఆర్థిక సాయమే కాదు.. అనుకూలమైన ప్రతిపాదనలు కావాలి

– సీఎం చంద్రబాబు

అక్షర ఉదయమ్ – ఢిల్లీ

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..