ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎంపికకు నోటిఫికేషన్

అక్షర ఉదయమ్ – అమరావతి: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.

ఈ నెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు.

వచ్చే నెల 3వ తేదీన పరోక్ష పద్దతిలో ఎన్నిక.

తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు.

నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ల కోసం ఎన్నిక.

బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ళ మున్సిపాలిటీలకు వైస్ ఛైర్ పర్సన్ల కోసం జరగనున్న ఎన్నిక.