ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

అక్షర ఉదయమ్ – తిరుమల:  ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని భేటీ కానున్న పాలకమండలి.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమీక్ష.

భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్న చైర్మన్ బీఆర్ నాయుడు.

రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివనున్న శ్రీవారు.

జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

ఫిబ్రవరి 3 నుండి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన టీటీడీ.

ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.