అందరూ బాగుండాలి….

అందరూ బాగుండాలి
– రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని ఆకాంక్ష
– స్వామి వారిని దర్శించుకొని, రథం లాగిన యరపతినేని
– భక్త జనంతో పోటెత్తిన పిడుగురాళ్ళ

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్ లో కొలువైయున్న సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి రథోత్సవం కళ్యాణోత్సవం, 18వ వార్షికోత్సవం సందర్భంగా పిడుగురాళ్ళ పట్టణం భక్త జనంతో పోటెత్తింది. స్వామి వారి రథోత్సవం కళ్యాణోత్సవం, 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, యువ నాయకులు యరపతినేని నిఖిల్ స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకు నిర్వహించిన రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు జై శ్రీరామ్ అంటూ స్వయంగా స్వామి వారి రథాన్ని లాగి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.