
అక్షర ఉదయమ్ – విజయవాడ: జూన్ లోగా అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని ఆయన సూచించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలని అన్నారు.
త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు చేపడతామన్నారు. కష్ట పడిన నేతలు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన తెలిపారు.