PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజల ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది కేటాయింపు: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్

PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజల ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది కేటాయింపు: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్

అక్షర ఉదయమ్ – గుంటూరు

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ(PGRS)” కార్యక్రమంలో తమ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్న ప్రజలు తమ ఫిర్యాదులు రాసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా ఫిర్యాదులు రాయించుకోవడానికి డబ్బులు కూడా వెచ్చిస్తున్నారని, పేద ప్రజలు నగదు చెల్లించలేక అవస్తలు పడుతున్నారని గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి వచ్చినది.

ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం” గా పని చేస్తున్న గౌరవ ఎస్పీ గారు ప్రజల ఫిర్యాదులు రాసిపెట్టడానికి సుశిక్షితులైన పోలీస్ సిబ్బందినీ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

కావున ప్రజల యొక్క నగదును, విలువైన సమయాన్ని ఆదాచేయడం కోసం వచ్చే సోమవారం నుండి జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజలకు వారి ఫిర్యాదులు రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయపడతారు అని గౌరవ ఎస్పీ గారు తెలిపారు.