గురజాల ఎమ్మెల్యే యరపతినేని రేపటి షెడ్యూల్ వివరాలు ఇవే..

అక్షర ఉదయమ్ – పల్నాడు

 

పల్నాడు జిల్లా గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గురువారం ఉదయం 8 గంటకు గురజాల మండలం దైద గ్రామంలోని శ్రీ అమర లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

ఉదయం 10 గంటలకు గురజాల మండలం దైద బిలం శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా చేయబోవు ఏర్పాట్లు గురించి గురజాల ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

 

మధ్యాహ్నం 2 గంటలకు గురజాల నగర పంచాయతీ జంగమహేశ్వరపురం గ్రామంలో “ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ విశ్వ విద్యాలయాన్ని” సందర్శిస్తారు.

 

సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రమైన రెంటచింతల గ్రామంలో కానుక మాత దేవాలయం 175వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి కోడె గిత్తల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

రాత్రి 7 గంటలకు పిడుగురాళ్ళ పట్టణంలోని ఏ.పీ.ఎస్.ఆర్టీసీ బస్టాండ్లో 4 నూతన నూతన ఎక్స్ ప్రెస్, ఒక పల్లె వెలుగు బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.