సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హాజరై పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆర్డివో గ్లోరియా,బాపట్ల తహసీల్దార్ సలీమా, జిల్లా పోలీస్ శాఖ డిఎస్పీ లు, సీఐ లు ఎస్సైలు, అమరవీరుల పోలీస్ కుటుంబాలు స్కూల్ బాలికలు పాల్గొన్నారు.

 

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.