పల్నాడు గడ్డపై అభివృద్ధి నినాదం
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యం
అక్షర ఉదయమ్ – గుంటూరు
గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తన నివాసంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లాలోని శాసన సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జాని సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పోరాడి వంద శాతం స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతుల సమస్యలు, సాగునీటి సరఫరా, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని నిశ్చయించారు. నాయకులందరి ఐక్యతతో పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల సంక్షేమంతో పాటు, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ వేదికగా నాయకులు స్పష్టం చేశారు.