గుంటూరులో పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్

    Date:

    📰 Generate e-Paper Clip

    గుంటూరులో పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్

     

    అక్షర ఉదయమ్ – గుంటూరు

     

     

    ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శుక్రవారం గుంటూరు పట్టణంలో పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయని ఆరా తీసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను ఎంతో ప్రాధాన్యతతో ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    జిల్లాలో మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,13,860, వితంతువులు 71,608, చేనేతకారులు 3,765, గీతకార్మికులు 443, మత్స్యకారులు 564, ఒంటరి మహిళలు 11,265, చర్మకారులు 866, హిజ్రాలు 67, హెచ్.ఐ.వి బాధితులు 2,580, కళాకారులు 74, డప్పు కళాకారులు 847, దివ్యాంగులు 24,493, వైద్య సంబంధిత పింఛనుదారులు 1,587, సైనిక సంక్షేమం 25, అభయహస్తం 3,932, అమరావతి భూముల సంబంధిత 17,413 పింఛన్లు పంపిణీ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....